కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్ నిర్వహించిన నేపథ్యంలో, మిగతా ఎమ్మెల్యేలతో కలిసి రేపు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొననున్నారు. పార్టీలో ఉన్న పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, ఎమ్మెల్యేల సమస్యలను నివృత్తి చేసే దిశగా ఈ సమావేశం జరుగనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా, ఎమ్మెల్యేలను నాలుగు గ్రూపులుగా విభజించి, ఆయా గ్రూపులతో ముగ్గురు కీలక నేతలు ప్రత్యేకంగా చర్చించనున్నారు. కాంగ్రెస్ నేతలు మారుతున్న రాజకీయ పరిణామాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేసే చర్యలను చేపట్టే అవకాశముంది.

