యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజాపేట మండలం కాల్వపల్లి గ్రామ పరిధిలోని పొట్టిమర్రి వాగులో ఈ ఉదయం ఒక కారు బోల్తా పడింది. ప్రమాదానికి పొగమంచు ముఖ్య కారణమని అక్కడి స్థానికులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

