రేపు నల్గొండలో జరగాల్సిన బీఆర్‌ఎస్ రైతు మహాధర్నా వాయిదా పడింది. ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో, పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ప్రస్తుతం ఈ విషయంపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ, విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.
పార్కింగ్, ట్రాఫిక్ సమస్యల కారణంగా అనుమతి ఇవ్వలేమని పోలీసులు తెలిపారు. అదే సమయంలో ఈ నెల 26 తర్వాత రద్దీ ప్రదేశంలో కాకుండా, అనువైన ప్రాంతంలో సభ నిర్వహించుకోవడంపై అభ్యంతరం లేదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు తదుపరి చర్యలు ఏమిటన్నది త్వరలో నిర్ణయించనున్నారు.

