రైలు పట్టాలు తప్పుడు. యేలాది మంది సచ్చిపోవుడు సూత్తనే ఉన్నం. మరి, గవాటిని జరగకుండ శేయాల్నంటే ఏట్ల? గిదీనికి గా రైల్లను నడిపేటోల్లు బలే ఇకమతు శేసిండ్రు.

కొందరు కోతి పోరగాండ్లు మస్తు ఇకమతులు పడ్తాంటరు. గా రైలు పట్టాల మీద రాల్లు పెట్టి, గా ఇపేమ గిర్రలు గవాటిని పిండి పిండి శేసుకుంట పోతాంటే సూద్దామనుకుంటరు. గవాటి వల్ల రైల్లు బోల్తా పడ్తానయని తెలుసుకోరు. గసొంటియి జరగకుండ, గా రైలోల్లు రైలు ఇంజను ముందట స్టోన్ రిమూవర్ ప్లేటును పెట్టిండ్రు. ఇగ రైలు పోతాంటే…గా ఇంజన్ ముందట ఉండే గా ప్లేటు… పట్టాల మీద ఉండే గా రాల్లను తీసేత్తాంది. ఇగ రైలు గూడ సక్కగ పోతాంది. మంచిగుంది కదా? గీ ఇకమతు.

