స్పందించిన CM| సీఎం Chandrababu| చంద్రబాబు
Chittor District| చిత్తూరు జిల్లా కుప్పం మండలం NARAYANAPURAM| నారాయణపురం గ్రామంలో అప్పు తీర్చలేదని ఓ మహిళపై జరిగిన దారుణ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. బాధితురాలు శిరీష (25) గతంలో భర్త తిమ్మరాయప్ప ద్వారా మునికన్నప్ప అనే వ్యక్తి వద్ద రూ.80,000 అప్పు తీసుకున్నారు. అనంతరం అప్పు చెల్లించలేక తిమ్మరాయప్ప గ్రామం వదిలి వెళ్లిపోవడంతో శిరీష పిల్లలతో కలిసి కూలి పనులు చేస్తూ అప్పు తీర్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఇటీవల అప్పు తిరిగి ఇవ్వలేదన్న కారణంతో మునికన్నప్ప ఆమెను రోడ్డుపై దూషించి, చంపేస్తానంటూ బెదిరింపులు చేశాడు. అనంతరం బలవంతంగా ఆమెను లాక్కెళ్లి వేప చెట్టుకు తాడుతో కట్టేసి చిత్రహింసలు పెట్టాడు.
ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీతో మాట్లాడి బాధిత మహిళను హింసించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పకడ్బందీగా వ్యవహరించాలన్నారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉండాలని జిల్లా అధికారులకు సూచించారు. ఇప్పటికే మునికన్నప్పను అరెస్టు చేసినట్లు ఎస్పీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ ఘటన సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

