ఆంధ్ర ప్రదేశ్ లో నిన్న రాత్రి నుంచి జరిగిన నాలుగు వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో 10 మంది మృతి చెందారు. హైదరాబాద్ నుండి కాకినాడ వెళ్ళిపోతున్న ట్రావెల్స్ బస్సు ఏలూరు (మ) సోమవరప్పాడులో లారీని ఢీకొని ముగ్గురు మరణించారు. చిత్తూరు ఇరువారం జంక్షన్ వద్ద బైకును కారు ఢీకొట్టింది, అందులో ఇద్దరు మృతి చెందారు. విశాఖలో కంచరపాలెంలో చెట్టును బైక్ ఢీకొని ఇద్దరు మరణించారు. నిన్న రాత్రి గువ్వలచెరువు ఘాట్‌లో, కారును తప్పించబోయి లారీ లోయలో పడిన ప్రమాదంలో ముగ్గురు మరణించారు.

