ఏపీలోని శ్రీశైల మహా శైవ క్షేత్రంలో ఈ నెల 19వ తేది నుండి మార్చి 1వ తేది వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 22 వ తేది టీటీడీ నుంచి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పణ, 23వ తేదిన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారు అని తెలిపారు.

