ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8న విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం 4.15 గంటలకు నగరానికి చేరుకునే ఆయన, సిరిపురం కూడలి నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ గంటసేపు ప్రసంగంతో PM సభ కొనసాగుతుంది. విశాఖ రైల్వే జోన్, NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాత్రి 7 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరతారు.

