మే 7, 8 తేదీలలో పాకిస్తాన్ వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో, బుధవారం ఉదయం భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ప్రతీకార దాడి చేసిందే తప్ప ప్రత్యర్థిపై దాడులకు ముందడుగు వేయలేదని స్పష్టం చేస్తూ, భారత దేశంలోని సైనిక స్థావరాలపై దాడి జరిగితే తగిన శాస్తి చేస్తామని భారత రక్షణ శాఖ హెచ్చరించింది. గురువారం భారత రక్షణ శాఖ ప్రెస్ రిలీజ్ విడుదల చేయగా, భారత సైన్యం ఈ రోజు తెల్లవారుజాము నుండి పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా, వైమానిక దళాలతో, అదే స్థాయిలో, పాకిస్తాన్ దాడులకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, లాహోర్‌లోని ఒక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా నాశనం చేశామని భారత రక్షణ శాఖ తెలిపింది.
ఇది జరుగుతుండగానే పాకిస్తాన్, లైన్ ఆఫ్ కంట్రోల్‌లో తీవ్రత పెంచుతూ మోర్టార్లు, భారీ స్థాయి ఆర్టిల్లరీతో కాల్పులు జరుపుతోందని, ఈ కాల్పులతో జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా, ఊరి, పూంఛ్, మెంధర్, రాజౌరీ ప్రాంతాల్లో 16 మంది సామాన్య పౌరులు మరణించారని, ఇందులో ముగ్గురు మహిళలు, ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారని చెప్పారు.
పాకిస్తాన్ కాల్పులను ఆపేందుకు భారత్ కూడా ప్రతీకార చర్యలు చేపడుతున్నామని, భారత సైన్యం, యుద్ధం పెంచే దిశగా తమ విధానం కాదని రక్షణ శాఖ స్పష్టం చేసింది, పాకిస్తాన్ కూడా శాంతిని గౌరవిస్తే పరిణామాలు మరింత ప్రశాంతంగా ఉంటాయని భారత రక్షణ శాఖ తెలిపింది.
ఈ ఘటనల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అయితే, భారత వైపు నుంచి ప్రతికార చర్యలు అవసరమైన చోట మాత్రమే తీసుకుంటున్నదని తెలుస్తుంది.

