Monday, March 30, 2026
35.2 C
Hyderabad

పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయాలు

సింగపూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అలాగే స్కూల్‌లో వ్యాపించిన పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వెంటనే స్కూల్ సిబ్బంది, వైద్య సిబ్బంది అప్రమత్తమై అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మార్క్ శంకర్‌కు వైద్యం అందుతూ, పరిస్థితి స్థిరంగా ఉందని సమాచారం.

చిరంజీవి ప్రకటన

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని చిరంజీవి తెలిపారు. కాళ్లు, చేతులకు మాత్రం గాయాలయ్యాయ్ అని అన్నారు.

ఈ వార్త రెండు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి సమాచారం చేరగానే, వెంటనే అధికారులతో పాటు పార్టీ నాయకులు ఆయనకు సింగపూర్ వెళ్లే ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. అయితే పవన్ కల్యాణ్ గారు స్పందిస్తూ, “నిన్న అరకు సమీపంలోని కురిడి గ్రామంలోని గిరిజనులకు పర్యటన వస్తానని మాట ఇచ్చాను. వాళ్లను కలవడం, వారి సమస్యలు వినడం నా బాధ్యత. అలాగే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాబట్టి ముందుగా నా బాధ్యతను నిర్వర్తించి, వెంటనే కుమారుడిని చూడటానికి వెళ్తాను,” అని స్పష్టంగా చెప్పారు.

అటు పర్యటన ముగించుకుని పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా సింగపూర్‌కు బయలుదేరనున్నారు. అధికారులు, వైద్యులు మార్క్ శంకర్ ఆరోగ్యంపై నిరంతరం అప్డేట్స్ అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పవన్ కుటుంబం తీవ్ర ఆందోళనకు లోనైంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Latest News

30-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు ఉపరి పుబ్బ యోగం శూల సాయంత్రం 05.15 వరకు ఉపరి గండ కరణం బాలవ ఉదయం 07.34...

ఎండ యేడికి సల్లని రేకులు!?|ADUGU TRENDS

ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి?...

ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?|EDITORIAL

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News