రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మరింత ఉద్రిక్తత సంతరించుకుంది. తాజాగా, చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంపై రష్యా డ్రోన్ దాడి చేసింది, రేడియేషన్ భయాలు పెరిగాయి. ఉక్రెయిన్ సమయానుసారం తెల్లవారుజామున 2:01 గంటలకు ప్రొటెక్టింగ్ షెల్టర్‌పై దాడి జరిగింది. ఈ షెల్టర్ అణు వ్యర్థాల లీకేజీ నివారించేందుకు నిర్మించబడింది. దాడి సీసీటీవీ ఫుటేజీ వైరల్ అవుతోంది. IAEA రేడియేషన్ స్థాయిని పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతానికి స్థితి అదుపులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాల మద్దతుతో రష్యా దూకుడును ఎదుర్కొంటోంది.

