అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. అమెరికన్లపై ఆదాయపు పన్నును తొలగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ప్రకటించారు. రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో మాట్లాడుతూ, ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆదాయంలో తగ్గుదల ఏర్పడితే, దాన్ని ఇతర దేశాలపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా సమతుల్యం చేస్తామన్నారు. ఈ చర్యతో అమెరికన్ల ఆర్థిక స్థాయిని పెంచి, దేశాన్ని మరింత శక్తివంతం చేస్తానని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు.

