జమ్మూ కాశ్మీర్ వాసుల కోసం వందే భారత్ రైలు నిరీక్షణ ముగిసింది. రైలు ట్రయల్ విజయవంతమైంది. ఈ రోజు రైలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైలు వంతెనను దాటి ప్రయాణించింది. ప్రత్యేకంగా రూపుదిద్దిన ఈ రైలు మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో కూడా సాఫీగా నడుస్తుంది. వచ్చే నెల నుంచి కత్రా-శ్రీనగర్ మార్గంలో అందుబాటులోకి రానుంది. టికెట్ ధరలు ఏసీ చైర్‌కార్‌కు రూ. 1,500-1,600, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ. 2,200-2,500 గా నిర్ణయించారు.

