ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పర్యావరణ పరిరక్షణకు తాను కట్టుబడి వున్నానని ‘ట్రిలియన్ ట్రీ ఉద్యమం’ (Trillion Tree Campaign)లో భాగమవుతానని ప్రమాణం చేశారు. భవిష్యత్ తరాల సంక్షేమం కోసం 1 ట్రిలియన్ మొక్కలు నాటే ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యులవాలని ఆయన తెలిపారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో వన్ ట్రిలియన్ ట్రీ ఆర్గనైజేషన్ నిర్వాహకులు తెలంగాణ పెవిలియన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు కలిసి పర్యావరణ ప్రమాణం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి రంగంలోనూ నెట్ జీరో విధానాలను అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, నేచర్ పాజిటివ్ పిల్లర్ సహ వ్యవస్థాపకురాలు నికోల్ ష్వాబ్, 1t.org నిర్వాహకులు ఫ్లోరియన్ వెర్నాజ్ తదితరులు పాల్గొన్నారు.

