వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని గా బంకులోల్లు గోల్ గోల్ శేయబట్టిరి. గీ గోల్మాల్ లనే ఒకాయినె కూగ గోల్ గోల్ శేసిండు.

ఉత్తర ప్రదేశ్ రాస్ట్రంల బస్తీ అని ఒక జిల్లా కేంద్రమైన పట్టణముంది. గాడ ఓ పెట్రోల్ బంకులకు ఒకాయినె 500 లీటర్ల ఇంటి మీది పెట్టుకునే నీటి ట్యాంకును పట్టుకొచ్చిండు. ఇగ పెట్రోల్ పోసుకుంటోల్లు ముక్కుమీద ఏలేసుకున్నరు. గిదేందిర బయి? పెట్రోలు దొరకకనే మేం లైన్లు కట్టబడితిమి. నువ్వెంది? గంత పెద్ద డ్రమ్మే తెచ్చినవని గోల గోల.. గేలి కూడ శేశిండ్రు. గంతేనా.. గాయినె గా డ్రమ్మును ఎత్తుకుని గా బంకంతా తిరిగిండు. ఇగ గిదే సైమమని గ దానిని యీడియ తీసి సొషల్ మీడియల పెట్టిండ్రు. ఇగ గదిప్పుడు మస్తు వైరల్ అయితాంది.

