స్థల పరిశీలన చేసిన ఎంఎల్ఏ యశస్విని
తొర్రురు పట్టణ కేంద్రంలో టియుఎఫ్ఐడిసి నిధుల నుండి రూ. 5.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఆడిటోరియం కోసం స్థానిక శాసన సభ్యురాలు యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి భూమిని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్యెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాటడుతూ … ఆడిటోరియం పూర్తయిన తర్వాత పట్టణ ప్రజలకు సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ప్రజావసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు స్థానిక యువత, ప్రజలకు బహుముఖ ప్రయోజనాలను అందించనుందని వారు తెలిపారు. ఈ ఆడిటోరియం నిర్మాణం పూర్తవడంతో పట్టణం అభివృద్ధిలో మరొక కీలక ముందడుగు పడుతుంది అన్నారు. ఎమ్మెల్యే వెంట స్థలాన్ని పరిశీలించిన వారిలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పట్టణ మండల అధ్యక్షులు, వార్డు కౌన్సిలర్లు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు, ఉన్నారు.

