Monday, March 30, 2026
35.2 C
Hyderabad

Greenary| పచ్చదనం, Women empowerment| మహిళా సాధికారత మా telangana government| ప్రభుత్వ బాధ్యత

వన మహోత్సవం–2025 ప్రారంభోత్సవంలో CM|సీఎం Revanth Reddy| రేవంత్ రెడ్డి

Rangareddy District| రంగారెడ్డి జిల్లా, rajendranagar|రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో|university వన మహోత్సవం–2025ను రుద్రాక్ష మొక్క నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతి పరిరక్షణపై ప్రజల బాధ్యతను గుర్తుచేస్తూ, మహిళల సాధికారతపై ప్రభుత్వ కృషిని గురించి వివరించారు. వనమే మనం… మనమే వనం అని పెద్దలు చెప్పినట్లుగా ప్రకృతి మన జీవనంలోని అంతర్భాగమని సీఎం అన్నారు. ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 18 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్దేశించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుననుసరించి, ప్రతి ఒక్కరూ తమ అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని, అలాగే అమ్మలు తమ పిల్లల పేరుతో మొక్కలు నాటాలని ఆయన సూచించారు. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నాటాలి. వాటిని మీ పిల్లల్లా సంరక్షించండి. అప్పుడు మాత్రమే తెలంగాణ పచ్చదనంతో నిండుతుంది అని సీఎం అన్నారు.

మహిళా సాధికారత విషయానికొస్తే, రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న చర్యలు చేపట్టిందని సీఎం వివరించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు బాధ్యత, ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించామని తెలిపారు. ఇది మహిళలకు ఆర్థిక, సామాజిక స్వావలంబనకు దోహదం చేస్తుందన్నారు. ఆర్టీసీ ప్రయాణాల్లో ఉచిత సౌకర్యం కల్పించడం ద్వారా మహిళల చలనం పెరిగిందని, అదే సమయంలో 1,000 బస్సులను మహిళల చేత అద్దెకు తీసుకుని, వారిని యజమానులుగా తీర్చిదిద్దే అవకాశం కల్పించామన్నారు. హైటెక్ సిటీలో ఉన్న విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఉన్న ప్రాంతాల్లో మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పించామన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్నదే మా లక్ష్యం అని స్పష్టం చేశారు. పట్టణాల్లో నివసించే మహిళలు కూడా మహిళా సంఘాల్లో చేరాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలకు రూ.21 వేల కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు.

అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు గౌరవంగా బతకేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మహిళా రిజర్వేషన్ అమలు కానుందనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు మహిళలకు కేటాయించే బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటానని సీఎం ప్రకటించారు. సమాజానికి మంచి జరగాలంటే ప్రకృతితో పాటు మహిళల స్థానం అభివృద్ధి చెందాలన్నదే ఈ వనమహోత్సవం సందేశమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత పరంగా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంగా తెలిపారు.

Latest News

30-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు ఉపరి పుబ్బ యోగం శూల సాయంత్రం 05.15 వరకు ఉపరి గండ కరణం బాలవ ఉదయం 07.34...

ఎండ యేడికి సల్లని రేకులు!?|ADUGU TRENDS

ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి?...

ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?|EDITORIAL

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News