Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

పలు అంశాల్లో Congress|కాంగ్రెస్, BRS|బీఆర్ఎస్ లు ఒక్కటే

CENTRAL MINISTER|కేంద్ర మంత్రి KISHAN REDDY|కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం అవినీతి అంశాలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టుకు బీజేపీ తరఫున ఇప్పటికే పిటిషన్ వేశామని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రజావ్యతిరేక చర్యలపై సీబీఐ విచారణ జరపాలంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి ఉత్తరం రాసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సీబీఐ విచారణపై నిశ్శబ్దంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. నాటి హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయవాదులు, వ్యాపారులు, నటులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయన్నారు. అంతేకాకుండా తన ఫోన్‌తో పాటు బీజేపీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేయబడినట్లు పేర్కొన్నారు. అందుకే సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిందని, ఆ దిశగా త్వరలో తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కేంద్రం పరిశీలనలో ఉందని, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తమ నివేదికను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సమర్పించిందన్నారు. ఈ అంశంపై జల ఒప్పందాలు, నిబంధనలు, గైడ్‌లైన్లు, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సెంట్రల్ వాటర్ కమిషన్ సమగ్ర పరిశీలన జరిపి తుది నివేదికను కేంద్రానికి అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇంతవరకు ఎవరికీ అన్యాయం జరగలేదని, జరగబోదని చెప్పారు. తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలన్న సూచన చేశారు.

ఇటీవల కొన్ని విమర్శల నేపథ్యంలో స్పందిస్తూ… కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు అనే విమర్శలు తగవని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వరద జలాల సమస్యలు ఉన్నా, ఇప్పటివరకు సమాచార మార్పిడి జరగలేదని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేంద్ర జలశక్తి మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయాలని, అవసరమైతే ఏపీ సీఎం పిలిపించి మాట్లాడే బాధ్యతను కేంద్రం చేపట్టాలని సూచించారు.

కాళేశ్వరం విషయంలో బీజేపీ ధోరణి ఎప్పటిలానే స్పష్టంగా ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో దోపిడీ జరిగిందని అప్పుడే నిపుణులు హెచ్చరించారని, ఇప్పుడు మేడిగడ్డకు వచ్చిన పగుళ్లు వారి మాటలు నిజమయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కూడా సీబీఐ దర్యాప్తు కోరామన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్ కొనసాగుతుందని చెప్పారు. గతంలో సీబీఐ దర్యాప్తు కోరిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాస్తవాలపై గౌరవం లేకుండా తన దిశను మార్చుకోవడం బాధాకరమన్నారు.

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News