-WEEK|వారం రోజుల్లోనే LOCAL ELECTIONS|స్థానిక ఎన్నికలంటూ వ్యాఖ్యలు
-కాదు.. కాదు.. CLARITY|క్లారిటీ అంటూ నొక్కులు
మొన్నటి దాకా MINISTER| మంత్రి SUREKHA|సురేఖ… నేడు మరో MINISTER| మంత్రి SEETHAKKA| సీతక్క… నోరు జారడం… వెనక్కి తీసుకోవడం WARANGAL| వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర మహిళా మంత్రులకు మాములైపోయింది. వెల్లడించ కూడని విషయాలను వెల్లడించడం, అనవసర అంశాలపై నోరు పారేసుకోవడం, ఆతర్వాత నాలుక్కరుచుకుని, మడతేయడం షరా మాములైంది. మొన్నా మధ్య మంత్రి కొండా సురేఖ రేవంత్ మంత్రివర్గంలోనే మంత్రులు తమ వద్దకు పనులపై వచ్చిన వారి నుండి పైసలు తీసుకుంటారని నోరు పారేసుకున్నారు. అది మరకముందే, ఇప్పుడు తాజాగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ధి శాఖల మంత్రి సీతక్క స్థానిక ఎన్నికలపై నోరు జారారు. ‘వారం రోజుల్లోనే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడుతుంద’ని చెప్పేశారు. అది కాస్తా వైరల్ కావడంతో సీఎం పేషీ నుంచి ఏంటిది? అని ఒత్తిడి రావడంతో నేను అలా అనలేదు. ‘వారం పది రోజుల్లో స్థానిక ఎన్నికలపై క్లారిటీ వస్తుందని మాత్రమే అన్నానంతే..!’ అని నాలుక తిరగేశారు.
అసలేం జరిగిందంటే… మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల అంతర్గత సమావేశం శుక్రవారం జరిగింది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ధనసరి అనసూయ సీతక్క వారం రోజుల్లోనే స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, పార్టీ శ్రేణులు అందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇది కాస్తా వైరల్ అయింది. సాధారణంగా ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది. మంత్రిమండలిలో లేదా సీఎం స్థాయిలో, పార్టీ నాయకత్వం సంసిద్ధత మేరకు ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను సీఎం ప్రకటిస్తారు. లేదా ఆయన ఆదేశిస్తేనే ఎవరైనా మంత్రి ప్రకటించే అవకాశం ఉంటుంది. ఒక వేళ నిర్ణయం తీసుకున్నప్పటికీ మంత్రి సీతక్క అలా ప్రకటించే అవకాశం ఉండదు. పైగా ప్రభుత్వ సంసిద్ధత మేరకు ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చూసుకుంటుంది. లోపాయిగా అనుకోవడం వేరు. బయటకు చెప్పడం వేరు. బహుషా సీతక్క అంతర్గతంగా విన్నవి, అనుకున్నవీ అలా లోపాయికారిగా పార్టీ కేడర్ ను రెడీగా ఉండాలని చెప్పి ఉంటారు. కానీ, అది కాస్తా పాలసీ మ్యాటర్ కావడంతో చెప్పకూడని మాట చెప్పినట్లయింది. పైగా ఆ అంశం చాలా కాలంగా ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్నది. దీంతో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది. సీఎం పేషీ దాకా వెళ్ళింది. దీంతో సీతక్కా? ఇదేం తీరక్కా? అని ప్రశ్నించడం, ఆతర్వాత సీతక్క మాట మార్చి, కేవలం వారం పది రోజుల్లోనే స్థానిక ఎన్నికలపై ఓ క్లారిటీ వస్తుందని మాత్రమే అన్నానని సవరించుకోవడం జరిగిపోయింది.
అయితే, సీతక్క చెప్పినట్లు వారం పది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే, వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్న వారి ఉప్పొంగిన ఆశలపై నీళ్ళు చల్లినట్లయింది.

