అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి|CM|REVANTH REDDY ఆదేశాలు
STATE|రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం|CM స్పష్టం చేశారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలోని ధాన్యం తడిపోకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తకుండా అన్ని కలెక్టర్లు|COLLECTOR తక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో వర్షం పడుతున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడకుండా చూడాలని సంబంధిత శాఖలను సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ|GHMC, పోలీస్|POLICE, హైడ్రా|HYDRAA, ట్రాఫిక్|TRAFFIC మరియు విద్యుత్ శాఖల మధ్య సమన్వయం కీలకం అని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
వర్షాల దృష్ట్యా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలను ఇవ్వాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ప్రజల భద్రతకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా అన్ని శాఖలు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

