Monday, March 30, 2026
35.2 C
Hyderabad

CITY సిటీకి ‘టు లెట్’!? TO-LET

అడుగు స్పెషల్ స్టోరీ!
సెకండ్స్ సేల్స్ ఢమాల్!
ఫస్ట్ సేల్స్ కమాల్!
‘పాత’కు పాతర!
‘కొత్త’కు జాతర!
సన్నగిల్లిన ఆసక్తి!?
సొమ్మసిల్లిన కొనుగోలు శక్తి!
శివార్లకు శివాలెత్తుతున్న ‘భాగ్య’నగర పౌరులు

CITY|TO-LET

‘కొత్తొక వింత! పాతొక రోత!!’ సర్వ సాధారణమే అయినా, ఇప్పుడు సిటీ సిటిజెన్స్ కి సరిగ్గా సరిపోయే సామెత. సదుపాయమైనా, మరేదైనా సరే, అంతేనా?, ‘అంతకు మించి…’ అంటున్నారు. కాస్ట్ కాస్త ఎక్కువైనా నో ప్రాబ్లెం.. ఏదైనా ఫస్ట్ ఇన్ ఫస్ట్… ఇప్పుడు ఇదే సిటీ సగటు జీవి ఫాస్ట్ ట్యాగ్… అందుకే సెకండ్స్ కి సేల్స్ పడిపోయింది. అత్యంత పతనావస్థలో సెకండ్స్ సేల్స్ ఉన్నాయి. ఒకప్పుడు మధ్య దిగువ తరగతి ప్రజలకు సెకండ్స్ అంటే ఎగపడేవారు. ఇప్పుడు ఎదురుపడేవారే లేకుండా పోయారు. ఇంతకీ, ఈ మహానగరానికి ఏమైంది? ఎవరో అగంతకులు ‘టు లెట్’ బోర్డు తగలేశారు!?CITY|TO-LET

CITY|TO-LET అవును. ఈ మహానగరానికి మాయరోగం వచ్చింది. ఒకప్పుడు రియల్, బిల్డర్ రంగాల బిల్డప్ పీక్స్ లో ఉన్నప్పటికీ, సెకండ్స్ సేల్స్ ఓ మోస్తరుగానైనా ఉండేది. అదేం విచిత్రమోగానీ, రియల్, బిల్డర్ రంగాలు బొక్కాబోర్లా పడ్డాయి. సరే, ఇప్పుడు పెరగాల్సిన సెకండ్స్ సేల్స్ ఢమాల్! మన్నాయి. సప్లయ్, డిమాండ్ ఆర్థిక సూత్రానికి భిన్నంగా, రెండు పడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొద్దో గొప్పో కొత్త కోసం పాకులాడుతున్న జనాల్ని చూస్తున్నాం. కానీ విస్తారంగా విస్తరిస్తున్న హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో సెకండ్స్ కి ఏ మాత్రం గిరాకీ లేకుండా పోయింది. దీంతో ఈ రంగంపై ఆధారపడిన లక్షలాది మంది బ్రోకర్లు లేదా మీడియేటర్లు లేదా రియల్టర్లు ఒక్కసారిగా కుదేలైపోయారు. లబోదిబోమంటున్నారు. అసలీ మహానగరానికి ఏమైందని జుట్టు పీక్కుంటున్నారు. ఎవరో అగంతకులు ‘టు లెట్!’ బోర్డు పెట్టారని సెటైర్లు వేసుకుంటున్నారు.CITY|TO-LET

CITY|TO-LETగత కొంత కాలంగా హైదరాబాద్ నగరంలో పాత ఇళ్ళు, ఫ్లాట్స్, అపార్ట్‌మెంట్లకు క్రమంగా గిరాకీ తగ్గిపోయింది. కొత్తగా ఇంటి కోసం వెతికే వాళ్ళు ఇప్పుడు పూర్తిగా బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ పైనే దృష్టిపెడుతున్నారు. పాత ఇండ్లను కొనాలన్న ఆసక్తి దాదాపు పూర్తిగా తగ్గిపోవడంతో సెకండ్స్ సేల్స్ కి తీవ్ర దెబ్బ తగలింది. ప్రస్తుతం నగరంలోని ప్రముఖ ప్రాంతాలలో వందల సంఖ్యలో పాత ఇళ్లు, ఫ్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నా, వాటిని కొనాలన్న మినిమం ఆలోచన కూడా వినియోగదారుల్లో కనిపించడం లేదు.CITY|TO-LET

హిమాయత్‌నగర్ నుంచి తార్నాక వరకు
CITY|TO-LETహైదరాబాద్ మహానగరంలో ఖాళీగా ఉన్న పాత ఇండ్లూ, ఫ్లాట్లు వెలవెలపోతున్నాయి. నగరంలోని హిమాయత్‌నగర్, గగన్‌మహల్, దోమల్ గూడ, నల్లకుంట, రాంనగర్, ముషీరాబాద్, అశోక్‌నగర్, చిక్కడపల్లి, బేగంపేట, పంజాగుట్ట, అంబర్‌పేట్, సికింద్రాబాద్, మెహదీపట్నం, లక్డీకాపూల్, హైదర్‌గూడ, తార్నాక, డీడీ కాలనీ వంటి ప్రాంతాల్లో వేలాది పాత ఫ్లాట్లు, ఇండ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నా కొనుగోలుదారులే కనిపించడం లేదు. ఈ ప్రాంతాల్లో హౌజింగ్ స్పేస్ వదిలే వారు పిల్లల చదువులు, పెండ్లిళ్లు, అనారోగ్య ఖర్చుల కోసం అమ్మకానికి పెట్టినా, నెలల తరబడి నిరీక్షిస్తూనే ఉండాల్సి వస్తోంది.CITY|TO-LET

ఒక్క బేగంపేటలో మాత్రమే డిమాండ్
CITY|TO-LETఇదే సమయంలో బేగంపేటలో మాత్రం పాత ఇండ్లకు గిరాకీ ఉంది. ముఖ్యంగా మార్వాడీ వ్యాపారులు ఈ ప్రాంతంలో గజానికి 10 లక్షల వరకు పెట్టేందుకు కూడా వెనుకాడడం లేదు. కానీ మిగతా ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఒకప్పుడు సెకండ్ సేల్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు వినియోగదారులు పాత ఇళ్లను కన్నెత్తి కూడా చూడడం లేదు. కొత్త ఇళ్ల పట్లే ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు.CITY|TO-LET

కొత్తకు స్వాగతం! పాతకు వందనం!!
CITY|TO-LETఉదాహరణకు హిమాయత్‌నగర్‌లో కొత్త అపార్ట్ మెంట్‌లో ఫ్లాట్ కొనాలంటే 1 ఎస్సెఫ్టీకి రూ.12 వేలకు పైగా ధర ఉన్నా సరే, కొనుగోలుదారులు అదేదీ పట్టించుకోకుండా, అవే ఫ్లాట్స్ కావాలని ఎగబడుతున్నారు. అదే పాత ఫ్లాట్ 1 ఎస్సెఫ్టీకి రూ.4వేలు అని చెప్పినా ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని చోట్ల టు లెట్ బోర్డులు పెట్టినా కూడా పట్టించుకునే వారే కరువయ్యారు.CITY|TO-LET

సిటీ ఔట్స్ పై ఆసక్తి!
CITY|TO-LETనగరంలో రద్దీ బాగా పెరిగి, జనజీవనం ఇరుకైపోయి, ఆక్సీజన్ లేవెల్స్ తగ్గి, ఊపిరాడని ట్రాఫిక్, పెరుగుతున్న కాలుష్యం వంటి సమస్యలతో జనం సతమతమవుతున్నారు. సిటీ జనంలో నగరంలో నివాసం ఉండాలన్న ఉత్సాహం తగ్గిపోతోంది. ప్రజలు ఎక్కువగా సిటీ ఔటర్ రింగు రోడ్ పరిధిలోని గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, ఫామ్ హౌస్ లను ఎంపిక చేసుకుంటున్నారు. నగరంలో సొంత ఇల్లు కలిగి ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు వాటిని అమ్మేసి శివారుకు శివాలెత్తుతున్నారు.CITY|TO-LET

నిరాశలో బ్రోకర్లు – వెలవెలబోతున్న వెబ్‌సైట్లు
CITY|TO-LETసిటీలో సెకండ్స్ సేల్స్ పై ఆధారపడిన లక్షలాది మంది బ్రోకర్లు లబోదిబోమంటున్నారు. నెలల తరబడి సేల్స్ లేకపోవడంతో కుటుంబంతో బతకడం ఎలా? పిల్లల ఫీజులెలా? ఇంటి రెంట్లు ఎలా? అన్న రంధిలో పడ్డారు. ‘నో బ్రోకర్’, ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో పాత ఇల్లు, ఫ్లాట్స్ అమ్మకానికి పెట్టినట్టు ప్రకటనలున్నా, వాటిపై స్పందన కనిపించడం లేదు. నెలల తరబడి ఆ ప్రాపర్టీలు అలానే ఉంటున్నాయి.CITY|TO-LET

CITY|TO-LETకొనుగోలుదారులే లేకపోవడంతో, అత్యవసరాల కోసం ఇంటిని విక్రయించాలనుకున్న ఓనర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఏన్నో ఆశలు పెట్టుకున్నా, కనీస మద్దతు ధర కూడా పలకని పరిస్థితుల్లో బెంబేలెత్తున్నారు. హైదరాబాద్ నగరంలో సెకండ్స్ సేల్స్ విభాగం పూర్తిగా పడిపోవడంతో ఈ రంగంలో కొనసాగుతున్న వారు భవిష్యత్ పట్ల భయభ్రాంతులకు లోనవుతున్నారు. సెకండ్స్ సేల్స్ రంగం సమీప భవిష్యత్తులో పుంజుకోకపోతదా!? అన్న ఆశలో ఉన్నారు.CITY|TO-LET

Latest News

30-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి ద్వాదశి ఉదయం 07.35 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం మఖ మధ్యాహ్నం 03.09 వరకు ఉపరి పుబ్బ యోగం శూల సాయంత్రం 05.15 వరకు ఉపరి గండ కరణం బాలవ ఉదయం 07.34...

ఎండ యేడికి సల్లని రేకులు!?|ADUGU TRENDS

ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి?...

ట్రంప్ కట్టడెలా? అమెరికా నిలువరింపెలా?|EDITORIAL

పశ్చిమాసియాలో పెరుగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, చమురు సరఫరాలపై ఏర్పడుతున్న అనిశ్చితి కలిపి అస్థిర దిశలో ప్రపంచాన్ని నడిపిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు, దూకుడు నిర్ణయాలు అంతర్జాతీయంగా సంచలనాలై,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 29 నుండి ఏప్రిల్ 04 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. పనుల్లో ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ...

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News