తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఎ. రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బీఎస్ జగ్జీవన్ కుమార్ సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, షబ్బీర్ అలీ, వేం. నరేందర్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు హాజరయ్యారు.

