సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
పాలకుర్తి సమ్మక్క సారక్కలు ఎలా ఉన్నారు… చెల్లెమ్మ బాగున్నావా…. ఝాన్సీ అక్క… ఎట్లున్నావ్…. కాలు మంచిగా అయిందా… ఆరోగ్యం బాగుందా… అంటూ… పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డిలను సీఎం రేవంత్ రెడ్డి ఆత్మీయంగా పలకరించారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ని పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులపై మర్యాదపూర్వకంగా కలవగాపై విధంగా మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధి పనులు, తొర్రురు మున్సిపాలిటీకి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ముఖ్యమంత్రికి వినతిపత్రం అందించి వివరించగా వారు సానుకూలంగా స్పందించారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్మన్ లకవత్ ధన్వంతి, డా. లక్ష్మీ నారాయణ నాయక్, మహేందర్ రెడ్డి తదితరులు వున్నారు.

