ఈ రోజు నుండి తెలంగాణ అసెంబ్లీ ఐదవ సెక్షన్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తున్నారు. ఈ రోజు అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
- నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- ఉదయం 11 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ
- ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణం
- 14న హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు
- 15వ తేదిన ధన్యవాద తీర్మాణంపై చర్చ
- 16వ తేదిన ఆదివారం అసెంబ్లీకి సెలవు
- 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ
- 18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ
- 19న 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- 20న అసెంబ్లీకి సెలవు
- 21వ తేది నుంచి బడ్జెట్ పై చర్చ
- 29 వరకు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

