వరంగల్-నల్లగొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. అధికారులు ఈ కౌంటింగ్ కోసం బ్యాలెట్ పేపర్లను కట్టలు కడుతున్నారు.ఒక్కో కట్టలో ఇరవై ఐదు ఓట్లు ఉండడంతో మొత్తం ఎనిమిది రౌండ్ల పాటు సాగనున్న కట్టలు కట్టే ప్రక్రియ సాగుతుంది.కౌంటింగ్ ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉండే అవకాశం ఉంది.

