(ఫైల్ ఫోటో)
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గ ముస్లిమ్ సోదర, సోదరీమణులకు ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దెైవ ప్రార్థనలు శాంతి, సామరస్యానికి వేదికలు కావాలన్నారు. తెలంగాణకే తల మానికమైన “గంగజమునా తెహజీబ్ ” మరింతగా పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. పేదింటి ముస్లిం మహిళల వివాహం కోసం రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నదని ఎమ్మెల్యే చెప్పారు. మరోసారి ముస్లిం సోదర, సోదరీమణులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు.

