బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. మేడిగడ్డ కుంగిన వ్యవహరంపై భూపాలపల్లి కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ఇవాళ (ఫిబ్రవరి 24) హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా లోయర్ కోర్టులో పిటిషన్ వేసిన రాజలింగ మూర్తి చనిపోయాడని కేసీఆర్ తరుఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే,కేసు వేసిన పిటిషనర్ చనిపోయినా, పిటిషన్ మెయింటేనబుల్ అని పీపీ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

