హైదరాబాద్ – కుషాయిగూడ బస్ డిపోలో భారీ ప్రమాదం జరిగింది. డిపోలో పార్కింగ్ లో ఉన్న రెండు బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందరూ చూస్తుండగానే కొన్ని నిమిషాలలో బస్సులు దగ్ధం అయ్యాయి. ఈ మంటలకు భయపడిన ఉద్యోగులు డిపో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు ఈ ఘటన స్థలిని పరిశీలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

