అమరవాది పై పెల్లుబికిన నిరసనలు
అమరవాది నువ్వు తప్పుకో మంటూ నినాదాలు
శ్యాం సుందర్ ను ఏకగ్రీవం చేద్దామని ప్రతినలు
అభిమానుల జయజయ ధ్వానాల మధ్య నామినేషన్
రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున తరలి వచ్చిన ఆర్యవైశ్యులు
తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఒకవైపు పోటాపోటీ గా నామినేషన్లు ఇరు వర్గాల మద్దతుదారులతో హైదరాబాదులోని లక్డికాపుల్ లో గల ఆర్యవైశ్య భవన్ లో దాఖలయ్యాయి. తన మద్దతు దారులతో ఒకవైపు కన్వీనర్ గా కొనసాగుతున్న అమరవాది లక్ష్మీనారాయణ మరొకవైపు మహాసభ విద్యాకమిటి చైర్మన్ గా ఉన్న మిడిదొడ్డి శ్యామ్ సుందర్ లు నామినేషన్లను వేశారు.
తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తొడుపునూరి చంద్రపాల్ కు సమర్పించారు. అంతకుముందే గద్వాల జిల్లా ఆర్య వైశ్యులు మిడిదొడ్డి శ్యాంసుందర్ తరఫున నామినేషన్ పత్రాలు సమర్పించారు. అనంతరం ఇరువర్గాలు వేర్వేరుగా సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు తమ మద్దతుదారుల మద్దతు లభించగా, మిడిదొడ్డి శ్యామ్ సమావేశ శిబిరంలో మాత్రం అమరవాదికి వ్యతిరేకత పెల్లుబికింది. అమరవాడికి తన పాత తరం నేతలు, పలు జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు మద్దతు మాత్రమే లభించగా, మిడిదొడ్డి శ్యామ్ కి మహాసభ మాజీ అధ్యక్షుడు ఐవిఎఫ్ జాతీయ అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్త, వైశ్య అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత గుప్త, ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త, కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, ఆర్యవైశ్య మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా మాజీ అధ్యక్షుడు గట్టు మహేష్ బాబు, నాగర్ కర్నూలు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు బచ్చు రామకృష్ణ, మొగలపెల్లి ఉపేందర్, ప్రేమ్ గాంధీ, చకిలం రమణయ్య, 33 జిల్లాల నుండి తరలి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు జిల్లాల ఓటర్లు ప్రత్యేకించి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ఆర్య వైశ్యులు, యువజన సంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా కల్వ సుజాత గుప్త మాట్లాడుతూ, అమరవాది తన ఓటమిని ఒప్పుకొని పోటీ నుంచి తప్పుకోవాలని అన్నారు. ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని అమరవాది పోటీ నుండి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కోలేటి దామోదర్ గుప్తా మాట్లాడుతూ పోటీ నుండి తప్పుకొని అమరవాది తన గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. సూర్యాపేట జిల్లా యువజన సంఘ అధ్యక్షుడు నీల వంశీ మాట్లాడుతూ అమరవాది పోవాలి కొత్త తరం రావాలి అంటూ, అమరవాది మాకొద్దు శ్యాం అన్నకే మా మద్దతు అంటూ నినదించారు. ఇదిలా ఉండగా కౌన్సిల్ సభ్యులు అభిమానులు తదితరులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాం సుందర్ ను అందరం ఒక్కతాటిపై నిలబడి గెలిపిస్తామని, ఆర్యవైశ్య మహాసభకు పట్టిన పీడను వదిలిస్తామని ప్రతిమబునారు.

ఈ సందర్భంగా మిడిదొడ్డి శ్యాం మాట్లాడుతూ, ఆర్యవైశ్య మహాసభ నియమ నిబంధనలకు అనుగుణంగా ఆర్యవైశ్యులకు నికార్సైన సేవలు అందించడానికి తన శక్తి వంచన లేకుండా పని చేస్తానని, అందుకు అందరి మద్దతుని అభ్యర్థిస్తున్నానని, తను ఆర్యవైశ్యుల కోసం ఇచ్చిన మేనిఫెస్టోని పూర్తిస్థాయిలో అమలుచేసి మహాసభలు అత్యున్నత స్థానానికి చేరుస్తానని ఆర్యవైశ్యులకు సేవ చేస్తానని ప్రకటించారు.

