సీఎం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి చర్యలు వేగవంతం చేస్తోంది. ఈ మేరకు సీఎం బంజారాహిల్స్ కంట్రోల్ కమాండ్ సెంటర్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 105 నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. స్థలాల ఎంపిక, అనుమతుల ప్రక్రియ వేగవంతం చేయాలని, అవసరమైతే వేరే ప్రదేశాల్లో భూమిని సమీకరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు ప్రదేశాలను పరిశీలించి, త్వరితగతిన స్థలాలను గుర్తించాలనే ఆదేశాలు జారీ చేశారు.

