రేపు ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల రిజర్వేషన్ల అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల విభజన, రిజర్వేషన్ల కేటాయింపు, తదితర అంశాలపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు. సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరుకానున్నారు.

