దేవరుప్పుల మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అవుల సురంజన్ రెడ్డి తల్లి అండాలు (84) అనారోగ్యంతో శనివారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కన్నుమూశారు.ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి తండ్రి తిరుపతిరెడ్డి హైదరాబాద్‌లోని సురంజన్ రెడ్డి నివాసానికి వెళ్లి… అండాలు భౌతికదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి… వారికి మనోధైర్యం అందించారు.ఈ కార్యక్రమంలో మామిడాల తిరుపతి రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓడపల్లి పుల్లయ్య, మాజీ ఎంపీటీసీ మహ్మద్ జాకీర్, ఓడపల్లి రవీందర్. నాయకులు మహ్మద్ షబ్బీర్, స్వామి, చింత కుమార్, వెంకటేష్, బిళ్ళ రాంరెడ్డి, ఆవుల రాంరెడ్డి,పూర్ణ, పులిపంపుల భాస్కర్, బంధుమిత్రులు, స్థానికులు, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై అండాలు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.

