గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తాజాగా ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నోటీసులు జారీ చేయాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో, స్పీకర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యీలకు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఈ అంశంపై న్యాయవాదులతో చర్చించినట్లు తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతను త్వరగా అమలు చేయడానికి అందుబాటులో ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నామని, త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

