గత నెల 31న జనగామలోని ప్రెస్టన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై స్కూల్ గ్రౌండ్‌లో జిల్లా స్థాయి సీనియర్ పురుషులు మరియు మహిళా సాఫ్ట్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ ఎంపిక పోటీల్లో పాలకుర్తి మండలం నుండి బాలబోయిన సందీప్ (చెన్నూర్), చిట్యాల రఘు (పాలకుర్తి), కుమార్ (ఇరవైన్ను) తదితర క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వీరు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ క్రీడా ఈవెంట్ ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో వరంగల్ జిల్లాలోని బొల్లికుంట వాగ్దేవి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూట్స్‌లో జరగనున్న 11వ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననున్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వీరిని గ్రామస్థులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లు అభినందిస్తూ, భవిష్యత్‌లో ఇంకా మంచి విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

