ఖైరతాబాద్ RTA కార్యాలయంలో నిర్వహించిన ఫాన్సీ నెంబర్ వేలం భారీ ఆదాయం తీసుకొచ్చింది. మొత్తం రూ. 38,76,996/- విలువైన బిడ్‌లు నమోదయ్యాయి. ఈ వేలంలో అత్యధిక ధర పలికిన నెంబర్ TG 09 E 0009, దీని కోసం వెంకటేష్ గౌడ్ ఇజా రూ. 10,46,999/- చెల్లించి సొంతం చేసుకున్నారు. రెండో స్థానంలో TG 09 D 9999 నెంబర్ నిలిచింది, దీని కోసం Eternal Avenues and Infrastructures Pvt Ltd సంస్థ రూ. 6,26,000/- బిడ్ చేసింది.
అదే విధంగా, TG 09 E 0001 నెంబర్‌ను శ్రీనివాస్ రెడ్డి పేరాటి రూ. 4,69,900/-కు సొంతం చేసుకోగా, TG 09 E 0005 నెంబర్‌ను Kara Conseil Pvt Ltd రూ. 2,43,001/-కు దక్కించుకుంది. TG 09 E 0006 నెంబర్ Goyaz Jewellery Private Limited రూ. 2,25,117/-కు పొందింది. TG 09 E 0007 (రూ. 1,58,003/-; S K Car Lounge), TG 09 E 0003 (రూ. 1,11,000/-; Vert Line Marine Bunkers Pvt Ltd), TG 09 E 0027 (రూ. 1,09,000/-; Neuland Laboratories Ltd), TG 09 E 0019 (రూ. 1,00,019/-; Sithara Entertainments) వేలం ద్వారా సొంతమయ్యాయి.
ఈ వేలం కోసం ఫాన్సీ నెంబర్లపై ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది. అధిక ప్రీమియం చెల్లించి ప్రత్యేక నెంబర్లు పొందేందుకు కార్ ఓనర్లు ఆసక్తి చూపడం గమనార్హం.

