విద్యార్థులు చదువులతోపాటు ఆటపాటల్లో రాణించాలని, ముఖ్యంగా వివిధ రకాల ఆటలు ఆడడం ద్వారా శారీరక మానసిక అభివృద్ధి ఉల్లాసం కలుగుతుందని పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఎడవెల్లి సోంమల్లయ్య అన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాలకుర్తిలో నిర్వహిస్తున్న ఆటల పోటీలకు ఆయన హాజరై పదివేల రూపాయలు బహుమతి అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారాణి తో కలిసి క్రీడలను ప్రారంభించి విద్యార్థులను ప్రోత్సహిస్తూ…. మాట్లాడారు. ప్రధానోపాధ్యాయురాలు పాయం శోభారాణి మాట్లాడుతూ… బహుమతులు అందిస్తున్న దాతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఓరుగంటి రమేష్ , సోoమల్లు ,బలరాం, నరసింహమూర్తి, వెంకటయ్య, మెహరుణ్ణిసా బేగం, మాలతి, అన్నపూర్ణ, ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.

