షాదన్ కాలేజీ ఎదురుగా చింతల్ బస్తీ ప్రాంతంలో జరుగుతున్న కూల్చివేతలను ఎమ్మెల్యే దానం నాగేందర్ అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలు ఆపకపోతే ఆందోళన చేయడానికి వెనుకాడనని హెచ్చరించారు. దావోస్ నుండి సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వచ్చేవరకు కూల్చివేతల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఇళ్లను కూల్చకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మానవీయత కోణాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

