ఫోన్ ట్యాపింగ్ కేసులో అమెరికాలో తలదాచుకుంటున్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను భారత్‌కు రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద కేంద్రానికి నివేదిక పంపిన సీఐడీ, విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికాకు నివేదికను చేరవేయనుంది. గ్రీన్‌కార్డ్ పొందిన ప్రభాకర్ అమెరికాలో ఉంటుండగా, శ్రవణ్ రావు వీసా గడువు ముగిసినప్పటికీ అక్కడే తలదాచుకున్నాడు. వారిని భారత్‌కు తీసుకురావడంలో భాగంగా రెడ్‌కార్నర్ నోటీస్ జారీకి పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

