పెద్ద ఎత్తున నినాదాలు, నాయకుల అరెస్టు
దేవరుప్పుల మండల కేంద్రంలో రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాల మేరకు దేవరుప్పుల మండల పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారి పై మహా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా నాయకులు పల్లా సుందర్ రాం రెడ్డి మాట్లాడుతూ … రైతులకు కాంగ్రెస్ పార్టీ చేసిన మోసానికి వ్యతిరేకంగా, ఎన్నికల ముందు రైతు భరోసా 15000 రూపాయలు ఇస్తా అని ఇప్పుడు 12000 రూపాయలు ఇస్తా అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రైతాంగానికి బిఆర్ఎస్ పార్టీ మద్దతుగా వుంటుందన్నారు. రైతులకు సంఘీభావంగా దేవరుప్పుల మండల కేంద్రంలోని సూర్యాపేట – జనగాం జాతీయ రహదారి పైన మహాధర్నా నిర్వహిస్తున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తీగల దయాకర్ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు , బస్వ మల్లేష్, మండల నాయకులు, ఎలె సుందర్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాంసింగ్, మండల ప్రధాన కార్యదర్శి చింత రవి, మండల నాయకులు. కారుపోతుల. భిక్షపతి, ఇంటి మల్లారెడ్డి, అల్లం ప్రదీప్ రెడ్డి, కుతాటి నర్సింహులు, జోగు సోమనర్సయ్య, గండిపెల్లి. యకయ్య, మైదం.జోగేశ్వర్, గడ్డం.రాజు, వంగ.అర్జున్, రాజన్న, కిష్టయ్య, సాయిలు, కారుపోతుల మల్లేష్, జోగు సుదర్శన్, తటిపెళ్లి.మహేష్ , లోడంగి వెంకటేశ్వర్లు యువజన నాయకులు, చింత పరుషారాలు, పందేనబోయిన.మధు, గణేష్, సామ్రాట్, మండల ముఖ్య నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

