నాగర్ కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి మండలంలోని నాయినేనిపల్లి గ్రామంలో మైసమ్మ జాతరకు భక్తుల తాకిడి పెరిగింది. మొక్కుకుంటే కోర్కెలను తీర్చే దేవతగా పేరు పొందిన మైసమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారికి కోళ్లు, పొట్టేలు బలి ఇచ్చి నైవేద్యాలతో తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. జాతర సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణాన్ని తలపించింది.
జాతర మైదానం భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది. దేవతను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరగా, ఆలయ సిబ్బంది వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

