సీఎం రేవంత్ నన్ను చంపాలని చూశాడని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రేవంత్ నన్ను చంపాలని చాలా సార్లు ప్రయత్నించారని అన్నారు. 58 సార్లు తనను ప్రెస్ మీట్ లో అడ్డుకునే ప్రయత్నం చేశాడని తెలిపారు. రేవంత్ సీఎం అవ్వాలంటే నేను సాయం చేశా, కానీ ఆయన నా సహాయం తీసుకొని నన్ను వదిలేశాడు’’ అని కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన చెప్పినట్టు, రాష్ట్రంలో ఆర్ఆర్ టాక్స్ వసూలు కొనసాగుతున్నాయి. నాగార్జున ఫంక్షన్ హాల్ కూల్చేశారు, కానీ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి సోదరులు పార్టనర్స్ గా వున్న ఫంక్షన్ హాల్స్ మాత్రం కాపాడుకున్నారు అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.

