పాలకుర్తి, డిసెంబర్ 21 (అడుగు న్యూస్): జనగామ జిల్లా పాలకుర్తి మండలం విస్నూర్ గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి సహకారంతో ఆ క్లబ్ అధ్యక్షుడు మాచర్ల పుల్లయ్య, ఎర్రబెల్లి రాఘవరావుల ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. పదవ తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి చిదిరాల మహేందర్, కోశాధికారి పబ్బ సంతోష్, బజ్జూరి వేణుగోపాల్, నంగునూరు రవీందర్, కృపాకర్, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

