కొనసాగడం కష్టమేనా!?
వివాదాల మీద CONTROVERSIES|వివాదాలు!
KONDA|కొండా ముందు రెండే దారులు…
హైదరాబాద్, ఆక్టోబర్ 17 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ వివాదం సద్దుమణిగిందా? సమూలంగా ఆగిపోయిందా? అన్నది పక్కన పెడితే, కొండా కుటుంబానికి వాద, వివాదాలు కొత్తేమీ కాదు. తమను నమ్ముకున్న వాళ్ళను గాక, తాము నమ్ముకున్నవాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేందుకు వెనుకాడరు అనే పేరు వాళ్ళకుంది. అన్నింటికంటే, అనేక వాద వివాదాలు. సొంత పార్టీలోనే విభేదాలు. సొంత నియోజకవర్గంలో సొంత పార్టీ కేడర్ పై కేసులు, వేధింపులు, లేని పోని అభాండాలు. మంత్రిగా తోటి మంత్రులతో, ఎంపీ, ఎమ్మెల్యేలతో వివాదాలు. నోటి దురుసు, చివరకు తన ఓఎస్డీని స్వయంగా ప్రభుత్వమే టర్మినేట్ చేసేదాకా తెచ్చుకున్న మంత్రి కొండా కుటుంబం చుట్టూతా అన్నీ వివాదాలే. దీనికి తోడు ఎన్నికకు చేసిన ఖర్చు వివాదంలో కొండా మురళి, అనేక మందిపై నోరు పారేసుకుని చేసిన అజమాయిషీ, ఇప్పుడు తాజాగా సుస్మిత వ్యాఖ్యలు… అన్నీ ఆమె మంత్రి పదవికే ఎసరు పెట్టేలా ఉన్నాయి? ఈ దశలో అయితే రాజీనామా చేయడం లేదంటే బర్తరఫ్ అవడం అనే రెండే దారులు కొండా సురేఖ ముందు కనిపిస్తునాయి. ఒకవేళ ఆమెను కొనసాగించినా, అది ఎంతో కాలం నిలిచేలా లేదు. కొండా కుటుంబం కూడా నిలబెట్టుకునేలా కనిపించడం లేదు. అయితే కొండా కుటుంబానికి సంబంధించిన కొన్ని వివాదాలు ఇప్పుడు మళ్ళీ చర్చకు వస్తున్నాయి. వారు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చర్చోపచర్చలుగా కొనసాగుతున్నాయి.
మచ్చుకు కొన్ని వివాదాలు:
-చారిత్రక అజంజాహీ మిల్లు కార్మిక భవనానికి, కబ్జాదారుతో కలిసి శంకుస్థాపన, ఆతర్వాత కబ్జాదారునికి మద్దతుగా నిలవడంతో సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత
-వరంగల్ లో ఓ బినామీతో సెటిల్ మెంట్లు. ఆ బినామీకి గన్ ఇప్పించారు. పోలీసులు తిరిగి ఆగన్ ను రద్దు చేసే దాకా వెళ్ళింది.
-పోలీసులను తాబేదార్లలా కొండా మురళి వాడుకున్నందుకు, ఏసీపీ, సీఐ, ఎస్ఐలు, సిబ్బందీ పై వేటు పడింది.
-వాడి పడేసే వారి పద్ధతి వల్ల నేటికీ అనేక మంది పోలీసు అధికారులు ఉద్యోగాలు కోల్పోయి, అటాచ్ అయో ఆందోళన చెందుతున్నారు.
-సొంత నియోజకవర్గం వరంగల్ తూర్పులో సొంత కేడర్ పై కేసులు, దాడులు, గొడవలు
-సమంత విషయంలో హీరో నాగార్జున పై తీవ్ర ఆరోపణలు
-హీరోయిన్ల లింకులతో కేటీఆర్ పై ఆరోపణలు
-మిగతా మంత్రుల్లాగా తాను లంచాలు తీసుకోనని వ్యాఖ్యలు. తనకు అలా వచ్చిన డబ్బును ఆ పాఠశాలకు ఖర్చు చేశానని మాటలు.
-ఎమ్మెల్యే నాయినితో విభేదాలు వాగ్వాదాలు
-ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డితో విభేదాలు
-ఎమ్మెల్యే రేవూరిపై తన అనుచరుడి కోసం పరుష పదజాలంతో తిట్లు
-ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియంతో గొడవ
-మంత్రి పొంగులేటితో మేడారం టెండర్ల గొడవ
-మంత్రి సీతక్కతో ప్రోటోకల్ పొట్లాట
-డీసీసీబీ విషయమై ఎర్రబెల్లి స్వర్ణతో సమస్యలు
-తూర్పులో బస్వరాజు సారయ్యతో
– తాజాగా తన ఓఎస్డీ వ్యవహారం

