నిన్న,నేడు,రేపు
రోజు ఏదైనా
వాదం ఒక్కటే
‘గాంధేయవాదం’
ఇది నొప్పి తెలియకుండా సూదిచ్చే యంత్రం
కొట్టకనే దెబ్బలు చరిచే తంత్రం
ఎదుటి వానిలో ఆలోచన రేపే మంత్రం
‘మహాత్మాగాంధీ’
శాంతికి బ్రాండ్ అంబాసిడర్
నాయకత్వానికి నిదర్శనం
ఉద్యమానికి ఊపిరి
మొత్తానికి భారతదేశ ‘మనిమకుటం’
ఒక్కమాటతో
జనాలకు జవసత్వాలు నింపి
స్వతంత్ర భావజాలాన్ని పంచి
అలుపెరుగని పోరాటంతో ఆంగ్లేయుల మెడలు వంచి
భారతావని దాస్యశృంఖలాలు త్రెంచిన వారిలో ముఖ్యుడై
యోధుడై
స్వాతంత్ర వీరుడై నిలిచిన
‘ఓ మహాత్మా’…
మీరు చిరస్మరనీయులు
మీకివే అక్షర నివాళులు

దారం సోమేశ్వర్
హనుమకొండ

