Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

ఫార్ములా-ఈ రేస్ కేసు నమోదు పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫార్ములా-ఈ రేస్ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్రంగా స్పందించారు. ఫార్ములా-ఈ రేస్ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి & ప్రభుత్వం చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. దీనిని లాత్కొర్ పని అంటూ విమర్శించారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ పెట్టమని మేము కోరడం వాస్తవానికి నిజాలు చెప్పడమే మా ప్రయత్నమేనని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “గత రెండు రోజులుగా స్పీకర్‌ను అసెంబ్లీలో చర్చకు అనుమతించాలని కోరుతున్నాం. మమ్మల్ని కుంభకోణంలో లాగడమే లక్ష్యమని, కానీ వారి ప్రయత్నాలు ఫలించవని,” తేల్చిచెప్పారు. నాలుగు గోడల మధ్యనే మాట్లాడితే ప్రజలు తెలుసుకోలేరని, 4 కోట్ల మంది ప్రజల ముందే ఈ విషయంపై చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు.

ఫార్ములా-ఈ రేస్ పట్ల  అప్పటి ప్రభుత్వ దృక్కోణం
ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా చెప్పొచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇది ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా పర్యావరణానికి హాని లేకుండా మెరుగైన రేసింగ్‌ ప్రోత్సహించడమే కాదు, రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలోనే 2001లో ఫార్ములా-1 రేస్‌ను దేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌లో పర్మనెంట్ ట్రాక్ కోసం గోపన్‌పల్లి ప్రాంతంలో 580 ఎకరాల భూమిని భూసేకరణ చేయడానికి నోటీసులు కూడా ఇచ్చారు. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదని,” కేటీఆర్ తెలిపారు.

ఫార్ములా-1 ట్రాక్ కోసం కేటాయించిన భూముల్లో రేవంత్ రెడ్డికి 15 ఎకరాల భూమి ఉందని కేటీఆర్ ఆరోపించారు. ఈ వివరాలను 2023 ఎన్నికల అఫిడవిట్‌లో రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారని పేర్కొన్నారు. అయితే, రేసింగ్‌ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదని విమర్శించారు.

ఫార్ములా-ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా ద్రవ ఇంధనాలకు ప్రత్యామ్నాయం కోసం ఏర్పాటవుతుండగా, తెలంగాణ ఈ కార్యక్రమాన్ని ముందుకు తెచ్చి విజయవంతం చేసిందని కేటీఆర్ వెల్లడించారు. “విశ్వవ్యాప్తంగా రేసింగ్‌లో పెద్ద మార్పు వచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలు చొరవ తీసుకోవడం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణానికి మేలు చేకూర్చడం జరుగుతోంది. ఇలాంటి రేసింగ్ ఈవెంట్ల ద్వారా నగరాలకు అంతర్జాతీయ గుర్తింపు వస్తుంది. హైదరాబాద్ ఈ విషయంలో ముందంజ వేసింది,” అన్నారు.

2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం 14 కీలక రంగాలను గుర్తించిందని, వాటిలో ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధన రంగాలను ప్రాధాన్యంగా తీసుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఈ రెండింటి కలయికగా ఎలక్ట్రిక్ వాహనాలు అభివృద్ధి చెందాయని అన్నారు. ఈ రంగాల్లో పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా రాష్ట్రం ముందడుగు వేసిందని వివరించారు.

మొనాకో సిటీ గ్రాండ్ ప్రీ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అలాగే, యూపీలోని నోయిడాలో జేపీ గ్రూప్ నిర్మించిన ట్రాక్‌లో ఫార్ములా-1 రేస్‌లు జరిగినప్పటికీ, అవి మూడేండ్లకు మాత్రమే పరిమితమయ్యాయని చెప్పారు. ఫార్ములా-4 రేసింగ్‌ ఇటీవల చెన్నైలో, జమ్మూకశ్మీర్‌లో జరిగిన సందర్భాలను గుర్తుచేశారు. అమిత్ షా కూడా ఫార్ములా-4 రేస్‌ను ప్రశంసించారని, ఈ విధమైన ఈవెంట్లు భారత దేశానికి గర్వకారణమని అన్నారు.

రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరాధారమని, అసలు వారి ఉద్దేశ్యం కేవలం ప్రజల దృష్టిని మరల్చడమేనని కేటీఆర్ ఆరోపించారు. “ఫార్ములా-ఈ రేస్‌పై ప్రభుత్వం సరిగ్గా సమాధానం ఇవ్వగలదని నమ్మకం లేదు కాబట్టే వారు చర్చకు రావడం లేదు,” అన్నారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మానసికత సాడిస్ట్‌గా ఉందని విమర్శించిన కేటీఆర్, ప్రజల మనోగతాలు గౌరవించకపోవడం వారి వైఫల్యమని అన్నారు. “ప్రజల కోసం ప్రభుత్వ విధానాలను తెచ్చే ప్రయత్నం చేస్తేనే అభివృద్ధి సాధ్యం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం అవాంఛనీయ ఆరోపణలు చేస్తున్నాయి,” అని అభిప్రాయపడ్డారు.

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News