తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. రథసప్తమి సందర్భంగా 3, 4, 5 తేదీల్లో SSD టోకెన్స్ జారీ చేయట్లేదని పేర్కొంది. భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా సర్వదర్శనానికి వెళ్లగలరని తెలిపింది. దీంతో పాటు రథసప్తమి (FEB 4) నాడు సిఫార్సుల దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

