శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-కృష్ణపక్షం
తిధి బ.విదియ రాత్రి 09.05 వరకు
ఉపరి తదియ
నక్షత్రం పుబ్బ రాత్రి 12.20 వరకు ఉపరి
ఉత్తర
యోగం అతిగండ రాత్రి 07.09 వరకు
ఉపరి సుకర్మ
కరణం తైతుల ఉదయం 08.18 వరకు
ఉపరి వణజి
వర్జ్యం ఉదయం 06.57 నుండి 08.41
వరకు
దుర్ముహూర్తం ఉదయం 08.24 నుండి
09.12 వరకు తిరిగి పగలు 12.24 నుండి
01.12 వరకు
రాహుకాలం ఉదయం 12.00 నుండి
01.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.48
సూర్యాస్తమయం సాయంత్రం 06.11
ఫిబ్రవరి 14 శుక్రవారం 2025
రాశి ఫలితాలు
మేష రాశి
శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, తగిన విశ్రాంతి తీసుకోవాలి. కంటి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆధ్యాత్మిక వ్యక్తులను కలుసుకుని వారి ఆశీర్వాదాలు పొందుతారు.
వృషభ రాశి
కుటుంబానికి ఆర్థిక లాభాలు. మీ సేవలకు గౌరవం లభిస్తుంది. వారసత్వ ఆస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. నిద్రలేమి, ఆహార లోపం చికాకులు కలిగించవచ్చు.
మిథున రాశి
వృత్తి విషయాల్లో ఆసక్తి తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికం. రహస్య శత్రువులను మీ తెలివితో అధిగమిస్తారు. విద్యార్థులు కృషి పెంచాలి.
కర్కాటక రాశి
ఉన్నత విద్య కోసం అనుకూల సమయం. దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల సందర్శనకు అవకాశం. తండ్రి, గురువుల ఆశీర్వాదాలు లభిస్తాయి.
సింహ రాశి
రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యక్తులను నమ్మేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.
కన్య రాశి
దూర ప్రయాణాలు, భాగస్వామ్య విషయాల్లో నూతన ఆలోచనలు. జీవిత భాగస్వామితో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్తలు అవసరం. సంతానం ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి.
తుల రాశి
ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. కోపాన్ని తగ్గించాలి. సామాజిక సేవ చేస్తారు. ఖర్చులు నియంత్రించుకోవాలి. శత్రువుల వల్ల చికాకులు ఎదుర్కొంటారు.
వృశ్చిక రాశి
విద్యార్థులు విద్యపై ఆసక్తి పెంచుకోవాలి. ఉపాసనాబలం పెంపొందించుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగ, ధ్యానం చేయడం మంచిది.
ధనుస్సు రాశి
విద్యాపరమైన నూతన విషయాలు తెలుసుకుంటారు. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గృహ సంబంధిత పనుల్లో చికాకులు ఎదుర్కొంటారు. ఉద్వేగాలను నియంత్రించుకోవాలి.
మకర రాశి
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కమ్యూనికేషన్ విషయంలో ఇబ్బందులు ఉంటాయి. ఆత్మీయుల సహకారంతో సమస్యలను అధిగమించాలి. గృహ సంబంధిత విషయాల్లో చర్చలు జరుగుతాయి.
కుంభ రాశి
ఆర్థిక ఖర్చులు అధికం. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాల్లో జోక్యం విసుగును కలిగిస్తుంది. మిత్రులతో కలిసి నూతన ఆలోచనలకు శ్రీకారం చుడతారు.
మీన రాశి
మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలనే కోరిక ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

