Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

ఫిబ్రవరి 13–గురువారం 2025

శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-కృష్ణపక్షం
తిధి బ పాడ్యమి రాత్రి 07.45 వరకు
ఉపరి విదియ
నక్షత్రం మఖ రాత్రి 08.48 వరకు ఉపరి
పుబ్బ
యోగం శోభ ఉదయం 07.34 వరకు
ఉపరి అతిగండ
కరణం బాలవ ఉదయం 07.23 వరకు
ఉపరి తైతుల
వర్జ్యం ఉదయం 09.21 నుండి 11.03
వరకు
దుర్ముహూర్తం ఉదయం 10.00 నుండి
10.48 తిరిగి పగలు 02.48 నుండి
03.36 వరకు
రాహుకాలం పగలు 01.30 నుండి
03.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.48
సూర్యాస్తమయం సాయంత్రం 06.11

ఫిబ్రవరి 13 గురువారం 2025
రాశి ఫలితాలు

మేష
ఆర్థికంగా ఒకటి రెండు శుభ యోగాలు పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా బాగా బలం పుంజుకుంటాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.

వృషభ
ముఖ్యమైన ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండడం మంచిది. ఆచితూచి అడుగువేయాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో శ్రమాధిక్యత ఉంటుంది. అధికారులు అతిగా ఆధారపడే అవకాశం ఉంది.

మిథున
ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో సమయం బాగా అనుకూలంగా ఉంది.

కర్కాటక
వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు, లక్ష్యాల వల్ల కలిగిన శ్రమ, ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. సర్వత్రా మీ మాటకు, చేతకు ఎదురు ఉండదు. గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి.

సింహ
ఇంటా బయటా కొద్దిగా శ్రమ, తిప్పట ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత నిర్ణయాల వల్ల లాభం ఉంటుంది. ఇతరుల మీద ఆధారపడడం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది.

కన్యా
ఆర్థిక పరిస్థితి సజావుగా సాగిపోతుంది. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతాయి.

తుల
ఆర్థికంగా రోజంతా సంతృప్తికరంగా గడిచిపోతుంది. తలపెట్టిన వ్యవహారాలు, పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలనిస్తాయి. అంచనాలకు మించిన ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.

వృశ్చిక
కుటుంబ వ్యవహారాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఒకటి రెండు ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆస్తి వ్యవహారాలు సానుకూలపడతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

ధనుస్సు
వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు విశేషంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఉద్యోగ జీవితం కూడా చాలావరకు సానుకూలంగా గడిచిపోతుంది. ఆర్థిక లావాదేవీలు పూర్తి స్థాయిలో సఫలమయ్యే అవకాశం ఉంటుంది.

మకర
ఆర్థిక పరిస్థితి సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. కొద్దిపాటి శ్రమ, తిప్పటలతో అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి.

కుంభ
ముఖ్యమైన వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలంగా ఉంటుంది
ఆర్ధిక వ్యవహారాలు జాగ్రత్త అవసరం గృహ వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి.

మీన
వృత్తి మరియు విద్యా రంగాల్లో మీ సృజనాత్మకత మెరుగుపడుతుంది, తద్వారా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.కుటుంబ, స్నేహితులతో గడిపే సమయం మీ ఆనందాన్న మరింత పెంచుతుంది.ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగ ఉండండి

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News