Saturday, March 28, 2026
35.2 C
Hyderabad

వార రాశి ఫలితాలు

జనవరి 05 –2025 నుండి జనవరి 11–2025
ఆదివారం నుండి శనివారం వరకు
వార రాశి ఫలితాలు

మేషం
వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. సంతాన వివాహ విషయమై ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగయత్నాలు కొంత అనుకూలిస్తాయి. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యగంలో అధికారులు అనుగ్రహంతో ఉన్నత పదవులు పొందారు. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.

వృషభం
చేపట్టిన పనులు అనుకున్న రీతిలో పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీరుస్తారు. కుటుంబ సభ్యులతో విభేదాలు తొలగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం మరింత ఉత్సాహాన్నిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థానచలన సూచనలు ఉన్నవి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి.

మిథునం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు చేసుకోగలుగుతారు. దూరపు బంధువులు ఆగమన ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. చిన్ననాటి మిత్రుడు తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సమాజంలో పలుకుబడి మరింత పెరుగుతుంది. విద్యార్థుల కష్టం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాల అందుకుంటారు. ఉద్యోగుల కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. వారం చివరిలో ప్రయాణ సూచనలు ఉన్నవి. వివాదాలు తప్పవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

కర్కాటకం
ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఆనందంగా గడుపుతారు. మిత్రులతో దైవ సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటా బయట మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు రాజీ చేసుకుంటారు. సంతాన శుభకార్యాలపై కుటుంబసభ్యులతో చర్చలు జరుపుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగం అవకాశములు అందుతాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చు చేయడం కష్టంగా మారుతుంది.

సింహం
అన్ని వైపుల నుండి ఆదాయం ఉంటుంది. ఆత్మీయులతో దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. అవసరానికి స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. సోదరులతో ఉన్నటువంటి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతాన వివాహయత్నాలు మరింత వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు కొంత శ్రమ మీద మంచి ఫలితం కనిపిస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిరస్తి ఒప్పందాలు అనుకూలిస్తాయి. నూతన వ్యాపారాలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో గుర్తింపు పెరుగుతుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కొందరి ప్రవర్తన మానసికంగా చికాకుగా అనిపిస్తుంది.

కన్య
చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుండి కొంత వరకు బయటపడగలుగుతారు. బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సమాజంలో ప్రత్యేకమైనటువంటి గౌరవ మర్యాదలు పొందుతారు. భూ క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు పరీక్ష ఫలితాలు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి కలుగుతుంది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారాలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది

తుల
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాలలో సొంత ఆలోచనలు అమలు చేసి ముందుకు సాగుతారు. భూ సంబంధిత వ్యవహారాలలో దాయదులతో ఒప్పందాలు కుదురుతాయి. గృహ నిర్మాణయత్నాలు సానుకూలంగా సాగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడి ఋణ బాధలనుండి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. వ్యాపారాలలో కీలక సమయంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. అన్ని రంగాల వారికి శుభ ఫలితాలుంటాయి. వారం చివరిలో చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో గాని పూర్తి కావు. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి.

వృశ్చికం
ముఖ్యమైన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. కొన్ని వివాదాలు సభ్యుల సహాయంతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలో ఒప్పందాలు కలసి వస్తాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. సంతాన వివాహయత్నాలు కలసివస్తాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలకు మిత్రుల సహాయ పోంది ఊరట పొందుతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగుల కష్టం పరుస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వారం ప్రారంభంలో వాయిదా వేయడం మంచిది. ఇతరులతో ఊహించని కలహాలు పెరుగుతాయి.

ధనస్సు
చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఇంటా బయట మీ విలువ మరింత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. బంధువుల నుండి అందిన ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. వ్యాపార వ్యవహారాల్లో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు వెళ్లటం మంచిది. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. అన్ని రంగాల వారికి వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభంలో చిన్ననాటి మిత్రులతో కలసి సూచనలు ఉన్నవి. నూతన రుణయత్నాలు అంతగా కలిసి రావు.

మకరం
ఇంటా బయటా పరిస్థితి మరింత అనుకూలిస్తాయి. ఆత్మీయ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. వ్యవహారాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శించి లాభాలు అందుకుంటారు. బంధువులు, మిత్రులతో ఉన్నటువంటి వివాదాలు సమసిపోతాయి. సోదరులతో స్థిరస్తి సంబంధిత ఒప్పందాలు చేసుకుంటారు. సంతానం విద్యా విషయాల ను శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభవార్తలు అందుతాయి. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు సంతోషకర సమాచారం అందుతుంది. వారం మధ్యలో మానసిక సమస్యలు బాధిస్తాయి. వ్యాపార భాగస్థులతో వివాదాలు కలుగుతాయి.

కుంభం
చేపట్టిన పనులు చివరి నిమిషంలో వాయిదా పడతాయి. రెండు రకములైన ఆలోచన వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువర్గం తో మాట పట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు మరింత చికాకు పరుస్తాయి. ధార్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకొని బాధపడతారు. ఇంటా బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇంటి నిర్మాణయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. కొన్ని రంగాల వారికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వారం మధ్యలో అరుదైన శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.

మీనం
చేపట్టిన పనులలో జాతీయం కలిగిన కొందరు దానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆర్థికపరమైన చర్చల్లో అనుకూలిస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు స్వీకరించి ముందుకు సాగడం మంచిది. ఇంటాబయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ కష్టం ఫలిస్తుంది. విద్యార్థులకు పరీక్షఫలితాలు ఆశజానాకంగా ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కళారంగం వారికి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

దెబ్బకు సోఫా జిడ్డు సఫా!?|ADUGU TRENDS

ఎన్కటికి ఇండ్లల్ల నులక మంచాలు, ఎత్తు పీటలు, శెక్క బెంచీలు, కుర్సీలుంటే సాలయ్యేది. ఇగిప్పుడు గయన్నీ పోతానయి. ఇనుప, కేన్ కుర్సీలు, సోఫాలొచ్చె. గా సోఫాలకు లోపల మెత్తటి దూది.. గదేనుల్ల కుషన్,...

ద్రవ్యోల్బణ సవాళ్ళకు పరిష్కారాలివే!|EDITORIAL

ప్రపంచ ఆర్థిక, రాజకీయ పరిణామాలు భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం, వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు...

28-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి దశమి ఉదయం 10.27 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.24 వరకు ఉపరి ఆశ్లేష యోగం సుకర్మ రాత్రి 09.35 వరకు ఉపరి ధృతి కరణం గరజి ఉదయం 10.28...

బంకులకి బాహు బలి!?|ADUGU TRENDS

వచ్చి రాని యుద్ధం వచ్చె. బొచ్చెడు కట్టాలు తెచ్చె. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబట్టె. నో స్టాకు బోర్డులు పెట్టబట్టిరి. కొరతే లేదని సర్కారోల్లు అనబట్టిరి. అసలు మా దగ్గర పెట్రోలే లేదని...

ట్రంప్ మూర్ఖత్వానికి ప్రపంచం మూల్యం!|EDITORIAL

ప్రపంచంలో యుద్ధాలు కొత్తేమీ కావు. కానీ, ఆ యుద్ధాల పరిణామాలు, ప్రభావాలు తీవ్రం. ఈసారి యుద్ధం మొదలైన తీరే విచిత్రం. ఏకపక్షం. అగ్రరాజ్యం అమెరికా సామ్రాజ్యవాదానికి, ట్రంపు టెంపరితనానికి పరాకాష్ట. అయితే, అమెరికా–ఇరాన్...

27-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం శ్రీరామనవమి శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవం తిధి నవమి మధ్యాహ్నం 12.22 వరకు ఉపరి దశమి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.34 వరకు ఉపరి పుష్యమి యోగం అతిగండ రాత్రి 12.08 వరకు ఉపరి సుకర్మ కరణం కౌలవ మధ్యాహ్నం...

గా దారం ఊసిపోదు! శార్జింగ్ వైరు తెగిపోదు!?|ADUGU TRENDS

ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది...

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై...

26-03-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి అష్టమి పగలు 02.35 వరకు ఉపరి నవమి నక్షత్రం ఆరుద్ర రాత్రి 06.55 వరకు ఉపరి పునర్వసు యోగం సౌభాగ్య ఉదయం 05.55 వరకు ఉపరి శోభ కరణం బవ పగలు 02.35...

రైతంటే గీ ఇగురుమున్నాయినే పో!|ADUGU TRENDS

ఇప్పటోల్లకేమో గనీ, ఎన్కటోల్లకు, నడీడుకొచ్చినోల్లకు ఎడ్ల బండంటే తెలుత్తది. దాన్ని ఎక్కిన అనుభవం ఉంటది. ఎన్కటికి యాడికిపోయినా ఎడ్లబండ్లే. సైకిలుంటే మహా, స్కూటరు, సైకిలు మోటరుంటే ఓ మోతుబరి, ఇగ కారున్నోల్లు దొరలు,...

పునర్విభజన పార్టీలకు పండగే!|EDITORIAL

జనాభా ఆధారంగా పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల స్థానాలను పునర్విభజించడం అనే ప్రక్రియ, ప్రజాప్రాతినిధ్యపు వ్యవస్థకు అవసరమైన సంస్కరణ కాగా, రాజకీయ ప్రయోజనాల పరంగానూ ఎంతో లాభదాయకం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా...

25-03-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--శుక్ల పక్షం తిధి సప్తమి సాయంత్రం 04.44 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మృగశిర రాత్రి 08.30 వరకు ఉపరి ఆరుద్ర యోగం ఆయుష్మాన్ ఉదయం 09.00 వరకు ఉపరి సౌభాగ్య కరణం గరజి ఉదయం 06.05...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News