గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరంలో ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ (AI 171) విమానం ఘోరంగా కూలిపోయింది. ఈ ప్రమాదం నగరంలోని ప్రసిద్ధ BJ MEDICAL COLLEGE| బీజే మెడికల్ కాలేజీపై చోటుచేసుకుంది. మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్|AHMEDABAD INTERNATIONAL AIRPORT| అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి LONDON| లండన్ వైపు బయలుదేరిన ఈ విమానం, టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే యాంత్రిక లోపం తలెత్తడంతో మేఘాల్లో కోల్పోయి, నగరంలోని బీజే మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో మెడికల్ కళాశాలలో ఉన్న STUDENTS| విద్యార్థులు, సిబ్బంది సహా 20 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. ఇందులో ఇద్దరు పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది సహా 230 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా, 53 మంది బ్రిటన్‌కు చెందినవారు, ఒక కెనడియన్, ఏడుగురు పోర్చుగల్ దేశ పౌరులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. విమానం లిఫ్ట్ తీసుకున్న వెంటనే తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి భారీ సంఖ్యలో ఎమర్జెన్సీ సేవల బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
విమానంలోని ప్రయాణికుల మృతదేహాలను వెలికితీసేందుకు NDRF బృందాలు, ఫైర్ సిబ్బంది ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. బీజే మెడికల్ కాలేజీ వద్ద ఏర్పడిన మంటలను అదుపులోకి తీసుకురావడానికి నాలుగు అగ్నిమాపక వాహనాలు పనిచేస్తున్నాయి. విమానం కూలిన ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేయించగా, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. విమాన ప్రయాణాలు నిలిపివేయడంతో అక్కడ ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి, సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలపై నిర్దేశాలు జారీ చేశారు. మరోవైపు, విమాన దుర్ఘటనలో జాబితాలో ఉన్న మాజీ గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి పట్ల ఊహాగానాలు వెలువడగా, ఆయన సహాయకుడు స్పందిస్తూ విజయ్ రూపాణి అదే విమానంలో ప్రయాణించాలని ఉన్నా, చివరి క్షణంలో మార్పులు జరిగి వేరే విమానంలో ప్రయాణించారు అని స్పష్టం చేశారు.
ఈ ఘోర ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు నేతలు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థాయిలో మృతుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.


